SRD: నారాయణఖేడ్ పట్టణ శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఆర్టీసీ బస్సు సెంటర్ నిర్మాణం ఏర్పాటుకు సోమవారం మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ స్వరూప్, వైస్ ఛైర్మన్ దారం శంకర్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశం మేరకు దాత తానాజీ పాటిల్ బస్ షెల్టర్‌ను స్వచ్ఛందంగా నిర్మిస్తామని చెప్పారు.