TG: కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందన్నారు. KCR హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య రంగంలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉండేదన్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు వైద్య సామగ్రిని హెలీకాప్టర్‌లో తరలించామని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రి సందర్శనకు వెళ్తే అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.