MNCL: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బొమ్మగోని అనిల్ గౌడ్ ప్రమాదవశాత్తు మరణించగా సోమవారం స్థానిక బీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబ సభ్యులకు పార్టీ ప్రమాద బీమా రూ. 2 లక్షల విలువగల చెక్కును అందజేశారు. పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని నాయకులు అన్నారు.