కడప: రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే గొప్ప సంకల్పంతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి కేవలం రూ. 5 కే పేదలకు భోజనాలు అందిస్తోంది. అందులో భాగంగా సోమవారం రాయచోటి పట్టణ పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్ వెలుపల ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను రాష్ట్ర రవాణాశాఖా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రారంభించనున్నారు.