BDK: బూర్గంపాడు మండలం మోతె గడ్డలోని వీరభద్ర స్వామి ఆలయం గోదావరి వరద కోతకు గురై ప్రమాద ముప్పులో ఉందని గ్రామస్థులు వాపోయారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ గుడిపై దృష్టి సారించాలని దేవస్థానం పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు కోరారు. మరమ్మతులు చేయాలని, 1000 ఏళ్ల నాటి ఈ గుడిని కాపాడాలని ఎమ్మెల్యేను వేడుకున్నారు.