NLG: మునగాల మండలం గణపవరంలో మృతి చెందిన విద్యార్థిని P.మహేశ్వరి కుటుంబానికి అండగా నిలవాలని BC విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి P.రామకృష్ణ యాదవ్ కోరారు. ఆదివారం గణపవరంలో మహేశ్వరి కుటుంబానికి ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ T.వాణి, శ్రీకాంత్ రాజులు ₹10వేల ఆర్థిక సహాయంతో పాటు ఒంటరిగా మిగిలిపోయిన మహేశ్వరి తమ్ముడికి ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.