NZB: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. ఆదివారం ఆలూరు మండల అంతర పాఠశాలల క్రీడోత్సవాలు ముగిసాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అడిషనల్ డీసీపీ బస్వ రెడ్డి హాజరయ్యారు. గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.