ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ప్రారంభించారు. ఈ పర్యటన అర్దరాత్రి దాటి తెల్లవారుఝామున 4 గంటలకు ముగిసింది. చంద్రబాబు నాయుడు, అజిత్ సింగ్ నగర్, ఇబ్రహింపట్నం, కృష్ణ లంక, ఫెర్రీ, మూలపాడు, జూపూడి ప్రాంతాలను సందర్శించి, రక్షణ చర్యలను అధికారులతో కలిసి సమీక్షించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికారులను 24 గంటలు పనిచేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో, ఆయన భోజనాన్ని సకాలంలో అందించేందుకు ఇంద్రకీలాద్రి కనకదుర్గ దేవస్థానం యాజమాన్యంతో మాట్లాడి, ఉదయానికి 1 లక్ష మందికి ఆహారం అందించవలసిందిగా ఆదేశించారు. అంతేకాకుండా, ప్రైవేట్ హోటళ్లతో సంప్రదించి, వరద ప్రభావిత ప్రజలకు తాత్కాలిక నివాసం కల్పించాలని కోరారు.
పర్యటన ముగిసిన తర్వాత, ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఒక బస్సులో 4 గంటల తరువాత విశ్రాంతి తీసుకున్నారు. ఆయన పర్యటన ద్వార, వరద బాధితుల కోసం తక్షణ సహాయం అందించడానికి, శాశ్వత పరిష్కారాలను అందించే ప్రయత్నం చేశారనే చెప్పవచ్చు.
చంద్రబాబు చేసిన ఈ తక్షణ చర్యలు వరద బాధితులకు భద్రతను అందించడమే కాకుండా, వారి కొండంత ధైర్యం ఇచ్చాయని చెప్పాలి. క్రైసిస్ మనగెమెంత్ లో చదన్రాబాబు చూపించే చొరవ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వైజాగ్ లో హుద్ హుద్ తుఫాన్ సమయంలో కేవలం ఒక వారంలోనే వైజాగ్ పూర్తిగా కోలుకోవడం లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు విజయవాడలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నగర వాసుల హృదయాలను గెలుచుకున్నారు.