»Samantha So What About Samantha Is It Original Or
Samantha: ఇంతకీ ‘సమంత’ పరిస్థితేంటి? అసలు ఉందా? లేదా?
ప్రస్తుతం సమంత పరిస్థితేంటి? సినిమాలు చేస్తుందా? లేదా? హెల్త్ కండీషన్ ఎలా ఉంది? లాంటి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. కానీ సామ్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. కానీ లేటెస్ట్గా ఓ సినిమా ఓపెనింగ్‌కు రాకపోవడం చర్చకు దారి తీసింది.
Samantha: So what about 'Samantha'? Is it original? Or?
Samantha: మయో సైటిస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్న సమంత.. తిరిగి సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. ఆ మధ్య సొంత బ్యానర్లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందా? లేదా? అనే విషయంలో ఇంకా కన్ఫర్మేషన్ లేదు. కానీ మళయాల స్టార్ హీరో ముమ్మట్టితో సమంత ఓ సినిమా కమిటైందని ఈ మధ్యన వార్తలు వచ్చాయి. చెప్పాలంటే.. మళయాళంలో సమంతకు ఇదే మొదటి సినిమా కానుంది. ఈ సినిమాను గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
సమంతను ‘ఏ మాయ చేసావే’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకి లాంచ్ చేసింది గౌతమే. ఆ తర్వాత మరోసారి ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాలో నటించింది సమంత. ఇక ఇప్పుడు మూడోసారి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతోంది. మమ్ముట్టి హీరోగా, సమంత కీలక పాత్రలో నటించనుందని టాక్ నడుస్తోంది. తాజాగా ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. అయితే.. ఈ సినిమా ప్రారంభోత్సవానికి గౌతమ్ మీనన్‌తో పాటు పలువురు సెలెబ్రిటీలు హాజరయ్యారు.
మమ్మూట్టి పై ముహూర్తం సన్నివేశం చిత్రీకరించారు. కానీ సమంత మాత్రం ఓపెనింగ్ కార్యక్రమానికి రాలేదు. దీంతో.. అసలు సమంత ఈ సినిమాలో ఉందా? లేదా? అనే డౌట్స్ మొదలయ్యాయి. ఓపెనింగ్ కార్యక్రమానికి రాకపోయినా.. డైరెక్ట్‌గా షూటింగ్లో జాయిన్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు సమంత, విజయ్‌తో కలిసి ఓ సినిమాకు సైన్ చేసిందనే టాక్ కూడా నడుస్తోంది. మరి సామ్ ఇలాంటి విషయాల్లో ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.