Ananth Amabani Wedding: Grand arrangements for the guests attending the wedding ceremony!
Ananth Amabani Wedding: రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈ వేడుకలకు ఎందరో అతిథులు హాజరు కానున్నారు. వీళ్లను అనంత్-రాధికా వివాహ వేదిక వద్దకు తరలించేందుకు మూడు ఫాల్కన్-2000 జెట్స్‌ను సిద్ధం చేశారు. ఈ మొత్తం వేడుకలకు దాదాపు 100 వరకు ప్రైవేటు విమానాలను వినియోగిస్తున్నట్లు సమాచారం. దేశంలోని నలుమూలల నుంచి ఈ పెళ్లికి వెళ్తున్నారు. వీళ్లని తరలించేందుకు ఈ విమానాలు వినియోగిస్తున్నారు. ఈ వివాహ వేడుకల్లో భాగంగా ఈరోజు శివ్వక్తి పూజ నిర్వహించారు. దీనిలో ముఖేశ్ అంబానీ, నీతా, అనంత్, రాధిక పాల్గొన్నారు. ఇంట్లో ఏర్పాటు చేసిన భారీ జ్యోతిర్లింగం వద్ద ఈ కార్యక్రమం జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా 1200 మంది అతిథులు ఈ వివాహానికి హాజరవుతున్నారు. వచ్చే అతిథులకు వడ్డించే భోజనాలు కూడా చాలా ప్రత్యేకమే. వారణాసిలో ప్ర్రసిద్ధి చెందిన కాశీ ఛాట్భండార్ వ్యాపారులు ప్రత్యేకమైన ఛాట్ ఏర్పాటు చేస్తున్నారు. మెనూలో కుల్ఫీ, ఫలూదా, టిక్కీ, టమాటా ఛాట్, పాలక్ ఛాట్, చనా కచోరీ, దహీ పూరి, బనారస్ ఛాట్ వంటి స్పెషల్ ఫుడ్స్ తయారు చేయిస్తున్నారు. నీతా అంబానీనే వీటిని స్వయంగా ఎంపిక చేశారు. ముంబాయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మూడురోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయి.