»Swiss Court Sentences 4 Members Of Hinduja Family Up To 4 5 Years In Jail For Exploiting Domestic Workers
Hinduja : స్విస్కోర్టు సంచనల తీర్పు.. హిందూజా కుటుంబంలో నలుగురికి జైలు శిక్ష
భారత సంతతికి చెందిన బిలియనీర్ల కుటుంబం హిందూజాలో నలుగురికి జైలు శిక్షను విధిస్తూ స్విట్జర్లాండ్ కోర్డు సంచలన తీర్పును ఇచ్చింది. ఇంతకీ వీరు చేసింది ఏమింటంటే..?
Hinduja Case Switzerland : బ్రిటన్‌లో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటి హిందూజా. భారత సంతతికి చెందిన వీరికి స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఓ విల్లా ఉంది. అక్కడ వీరు వర్కర్లను శ్రమ దోపిడికీగి గురి చేశారని నమ్ముతూ వీరికి స్విస్ కోర్టు(Swiss court) జైలు శిక్ష విధించింది. ఆ కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు 4.5 సంవత్సరాల పాటు జైలు( jail) శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ప్రకాష్ హిందూజా, ఆయన భార్య కమల, కుమారుడు అజయ్, కోడలు నమ్రతలకు ఈ శిక్షలు పడ్డాయి. అలాగే ఈ కుటుంబ వ్యాపారాలు చూసుకునే నబీబ్ జియాజీకి 18 నెలల సస్పెండెడ్ శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ వీరు చేసింది ఏమిటంటే..?
హిందూజా కుటుంబానికి(Hinduja family) జెనీవాలో ఓ విల్లా ఉంది. అక్కడ పని చేయడానికి వీరు భారత్ నుంచి పేదవారిని(domestic workers) తీసుకెళ్లారు. వారికి సరిగ్గా నిద్రపోవడానికి సమయం కూడా లేకుండా 15 నుంచి 18 గంటల పాటు పని చేయించుకుంటున్నారు. విల్లాని వదిలి బయటకు వెళ్లడానికి అనుమతించడం లేదు. పాస్‌పోర్టులు తీసేసుకున్నారు. జీతాలు కూడా వారికి ఇవ్వడం లేదు. డాలర్లలో కాకుండా రూపాయల్లో వేతనాల్ని చెల్లిస్తున్నారు. వారికి ఇవ్వకుండా భారత్‌లో ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లో ఈ ధనాన్ని జమ చేస్తున్నారు. రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తే 6.19 పౌండ్ల కంటే తక్కువ చెల్లిస్తున్నారు. అంటే భారత రూపాయల్లో 652. ఈ విషయాలన్నింటినీ ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ఆధారాలతో సహా ఉంచింది. దీంతో సిస్ చట్టాలను ఉల్లంఘించారని కోర్టు భావించి ఈ విధంగా తీర్పును ప్రకటించింది.