తమిళనాడు(tamilnadu) తిరుప్పత్తూరులోని వాణియంబాడిలో విషాదం చోటుచేసుకుంది. తైపూసం ఉత్సవాల్లో భాగంగా ఉచితంగా తెల్ల ధోతీలు, చీరల టోకెన్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలు కాగా, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ తైపూసం ఉత్సవాలు జరుపుకుంటారు. కానీ తమిళనాడులో ఇది ఒక ప్రధాన పండుగగా కొనసాగుతుంది. ఇది మురుగన్ జయంతి అని, మురుగన్ కార్తికేయుడు.. శివుడు, పార్వతి దేవి చిన్న కుమారుడని చెబుతుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తెల్ల దోతీలు, చీరలు అందజేస్తామని ప్రకటించడంతో స్థానికులు భారీగా ఎగబడ్డారు.