Maharastra : మహారాష్ట్రలో దారుణమైన మోసం వెలుగు చూసింది. ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ ఐరన్ అండ్ స్టీల్ మార్కెట్ కమిటీని ఓ మహిళ పెద్ద బ్యాంకు అధికారిగా నటిస్తూ రూ.54 కోట్లకు పైగా మోసం చేసింది. ఈ మోసం కేసులో మహిళపై నవీ ముంబై పోలీసులు కేసు నమోదు చేసినట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు. ఈ మొత్తం మోసం ఘటన ఎలా జరిగిందో తెలుసుకుందాం.
ఇలా కుట్ర పన్నింది
జూన్ 2022లో పన్వేల్‌లోని ఒక మహిళ తనను తాను బ్యాంకు మేనేజర్‌గా చెప్పుకుంది. అనంతరం ఐరన్ అండ్ స్టీల్ మార్కెట్ కమిటీ సభ్యులు, అధికారులను సంప్రదించింది. మహిళ కమిటీ సభ్యుల విశ్వాసాన్ని గెలుచుకుంది. వారికి అధిక వడ్డీ రేట్లను ఇప్పిస్తానని వాగ్ధానం చేసింది. నకిలీ పత్రాలతో కొటేషన్ కూడా సమర్పించింది. ఆ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని ఆ మహిళ కమిటీకి సూచించింది.
పెట్టుబడి విలువ రూ.54.28 కోట్లు
54.28 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పెట్టుబడికి సదరు మహిళ నకిలీ రశీదులు కూడా ఇచ్చింది. అయితే, డిపాజిట్ గడువు ముగిసిన తర్వాత డబ్బు, వడ్డీని తిరిగి ఇవ్వాలని కమిటీ డిమాండ్ చేయడంతో, మహిళ పరారైంది. డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదు. నిందితురాలైన మహిళ బ్యాంకు ట్రెజరీ, ఇన్వెస్ట్ మెంట్ డిపార్ట్ మెంట్ జారీ చేసిన నకిలీ లేఖను కూడా సమర్పించింది. అందులో డబ్బును తిరిగి ఇవ్వడానికి మరింత సమయం కోరింది. ఇంత పెద్ద మోసం కేసు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు పోలీసులు సోమవారం ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 420 (మోసం), 465 (ఫోర్జరీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.