Invite alliance to form Andhra Pradesh government Governor Justice Abdul Nazir
AP Governor: ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 12న కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టనుంది. గవర్నర్ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులు సైతం పాల్గొనడానికి ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అనుమతి కోరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముగ్గురు కలిసి సమావేశమయ్యారు. కూటమిపక్షనేతగా టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మొత్తం ఎన్డీయే కూటమి అభ్యర్థులు 164 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమిని ఆహ్వానించాల్సిందిగా కోరారు. అనంతరం రాజ్‌భవన్ ఆవరణంలో అచ్చెన్నాయుడు, పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. జూన్ 12 కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న సంగర్భంగా తమను ఆహ్వానించాలన్న విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షరాలు పురందేశ్వరి తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు చట్ట నిబంధనల ప్రకారం ఆహ్వానిస్తానని గవర్నర్ తెలయజేశినట్లు మీడియాకు పురందేశ్వరి చెప్పారు.