ఈమధ్య అమెరికాలో కాలేజ్ క్యాంపస్‌లలో బోర్గ్ డ్రింకింగ్ అనే ట్రెండ్ నడుస్తోంది. ఇది తాగే పానీయం. కానీ చాలా ప్రమాదకరమైనది. అసలు ఈ బోర్గ్ అంటే ఏమిటి తెలుసుకుందాం.
America: Trending borg drinking.. an intoxicating drink
America: ఈమధ్య అమెరికాలో కాలేజ్ క్యాంపస్‌లలో బోర్గ్ డ్రింకింగ్ అనే ట్రెండ్ నడుస్తోంది. ఇది తాగే పానీయం. కానీ చాలా ప్రమాదకరమైనది. ముదురు రంగులో ఉండే దీనిని వివిధ హానికర మిశ్రమాలతో తయారు చేస్తారు. వీటిని తాగడం వల్ల మత్తు ఎక్కుతుంది. దీంతో యువత వీటిని అధికంగా సేవిస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఈ బోర్గ్ అంటే గ్యాలన్ సైజు ప్లాస్టిక్ పాత్రలో వివిధ మిశ్రమాలను కలిపి తయారు చేసిన పానీయం. దీంట్లో వోడ్కా ఉంటుంది. ఒక గ్యాలన్ నీటి బాటిల్‌ను తీసుకుని, దాన్ని సగం ఖాళీ చేసి, అందులో 750 మిల్లీలీటర్ల వోడ్కాను కలుపుతారు.
అలాగే ఆల్కహాల్ రుచి తెలియకుండా కొన్ని ఫ్లేవర్స్‌ను కలుపుతారు. అయితే ఈ బోర్డ్ హ్యాంగోవర్‌ను నివారిస్తుందని ఎలక్ట్రోలైట్ పౌడర్లు కలుపుతారు. ఇవన్నీ కలిపిన తర్వాత తియ్యటి పానీయం తయారవుతుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారట. వాంతులు, ఫిట్స్ దీని లక్షణాలు. అలాగే డీహ్రైడ్ర్రేషన్కు దారితీసి ప్రాణాలకే ముప్పు తెస్తోందనట. దీర్ఘకాలంలో గుండె, మెదడు సంబంధిత సమస్యలకు దారితీస్తుందని వైద్యలు అంటున్నారు.