Sai Pallavi's birthday treat.. Special video from 'Tandel' team!
Sai Pallavi: తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన మలయాళ భామ సాయిపల్లవి పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సినిమా ప్రముఖులు సైతం సాయి పల్లవికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నటిస్తున్న సినిమాల అప్డేట్స్ కోసం అభిమానులు కాచుకు కూర్చున్నారు. అయితే నాగచైతన్య హీరోగా చందుమొండేటి దర్శకత్వంలో తండేల్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందులో హీరోయిన్గా సాయిపల్లవి నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. తన పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీమ్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది.
తండేల్ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది. దాంట్లో సాయిపల్లవి నువ్వు నవ్వితే నీతో పాటే నవ్వాము, నువ్వు ఏడిస్తే మేము ఏడ్చాము అని రాసుకొచ్చారు. సముద్ర జాలరుల జీవీతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం చాలా ఎమోషనల్ సబ్జెక్ట్ అని అర్థం అవుతుంది. ఎన్నో భావోద్వేగాలతో కూడిన కథ అని తాజా వీడియో చేస్తే తెలుస్తుంది. ఇక సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన నటి. ఎందుకంటే ఆమె ఎంచుకున్న పాత్రలు, ఆమె వ్యక్తిత్వమే ఇందుకు కారణం.