యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దేవర పై భారీ అంచనాలున్నాయి. అయితే.. ఈ సినిమా షూటింగ్ లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటికొచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబైలో ఉన్నాడు. దీంతో టైగర్ లేకుండానే ప్లాన్ చేస్తున్నాడట కొరటాల.
Devara: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముంబైలో ఉన్నాడు. అక్కడ హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ షూటింగ్లో పాల్గొంటున్నాడు. తారక్, హృతిక్ ఇద్దరి పై భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. నెక్స్ట్ వార్ 2 షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో చేయనున్నారు. అందుకోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మరోవైపు దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బ్యాలెన్స్ షూటింగ్‌ను వార్ 2 నుంచి ఎన్టీఆర్ తిరిగొచ్చాక కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ ఈలోపే దేవర కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాడు కొరటాల.
లేటెస్ట్ షెడ్యూల్‌ని విశాఖపట్నంలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఎన్టీఆర్ లేని కొన్ని సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. దీంతో.. వీలైనంత త్వరగా దేవర షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ఉంది. అక్టోబర్ 10న దసరా కానుకగా దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ అంచనాలను భారీగా పెంచేశాయి. దీంతో నెక్స్ట్ అప్టేట్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు.
మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండడంతో.. ఫస్ట్ సాంగ్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్‌తో సినిమాని నిర్మిస్తున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్టుగా టాక్ ఉంది. మరి దేవరతో ఎన్టీఆర్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.