Indonesia : ఇండోనేషియాలో కొండచరియలు విరిగి 19 మంది మృతి
ఇటీవల ఏక ధాటిగా కురుస్తున్న వర్షాలకు ఇండోనేషియాలోని సులవేసి దీవుల్లో పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
Indonesia : ఇండోనేషియాలో గత వారం రోజులుగా ఏక ధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు అక్కడ పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందారు. అక్కడి సులవేసి దీవుల్లోని మకాలే గ్రామంలో ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున మట్టి పెళ్లలు(Landslide) విరిగి పడటంతో వాటి కింద పడి 19 మంది మరణించారు.
మరణించిన వారిలో 14 మృత దేహాలను మాత్రమే ఇప్పటి వరకు వెలికి తీశారు. మరో ఇద్దరి ఆచూకి కూడా ఇప్పటి వరకు తెలియ రాలేదు. దీంతో వారి కోసం కూడా అన్వేషిస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇండోనేషియాలో(Indonesia) కురుస్తున్న వర్షాలు, దట్టమైన పొగ మంచు, వల్ల ఆపరేషన్ ఆలస్యం అవుతోందిని స్థానిక అధికారులు తెలియజేశారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్లో సైనికులు, పోలీసులు, వాలంటీర్లు నిరంతరం శ్రమిస్తున్నారు. మట్టిలో కూరుకుపోయి గాయ పడి ఉన్న ఇద్దరిని ఆదివారం వీరు విజయవంతంగా వెలికి తీయగలిగారు. వీరిలో ఎనిమిదేళ్ల చిన్నారి పాప కూడా ఉంది. ఇలా గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.