»Cbi Seizes Huge Consignment Of Drugs In Visakahaptanm Port
DRUGS : బ్రెజిల్ నుంచి విశాఖకు కంటైనర్‌లో భారీగా డ్రగ్స్.. పట్టివేత
విశాఖపట్నంలో డ్రగ్స్ భారీగా పట్టుబడటం కలకలం సృష్టించింది. బ్రెజిల్ నుంచి కంటైనర్‌లో విశాఖకు వచ్చిన డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
CBI SEIZED 25 THOUSAND KGS DRUGS : విశాఖపట్నంలో బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ షిప్పింగ్ కంటైనర్‌లో భారీగా డ్రగ్స్(Drugs) బయటపడ్డాయి. 25 వేల కిలోల డ్రగ్స్‌ని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కోసం బ్రెజిల్ నుంచి ఈ కంటైనర్ వచ్చింది. ఇంటర్‌పోల్ సమాచారంతో రంగంలోకి దిగిన దిల్లీ సీబీఐ కార్యాలయం… విశాఖ సీబీఐ, కష్టమ్స్ అధికారుల్ని అప్రమత్తం చేసింది. వారు 25 కిలోల చొప్పన వెయ్యి బ్యాగులు కంటైనర్‌లో ఉన్నట్లు గుర్తించారు.
జర్మనీలోని హంబర్గ్ మీదుగా ఇవి ఈ నెల 16న విశాఖకు వచ్చినట్లు సీబీఐ గుర్తించింది. ఈ మేరకు మే 19న నార్కోటిక్స్ నిపుణులతో వచ్చి సీబీఐ నిర్ధారించుకుంది. బ్రెజిల్ నుంచి ఎస్ఈకెయు 4375380 కంటైనర్ లో వచ్చిన ఈ సరుకును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై షిప్ అధికారులను ప్రశ్నించగా ఎండిన ఈస్ట్ ఇందులో ఉందని వారు సమాధానం ఇచ్చారు.
దీంతో సీబీఐ, పోర్టు అధికారులు కంటైనర్‌ను తెరిచి చూశారు. అందులో ప్లాస్టిక్ బ్యాగుల్లో పసుపు రంగులో ఉన్న పదార్థాన్ని చూశారు. దాన్ని ఎన్సీబీ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ ద్వారా పరీక్షించారు. అన్నింటిలోనూ కొకైన్, మెథాలక్వలైన్ ఉన్నట్లు పాజిటివ్ వచ్చిందని సీబీఐ పేర్కొంది. ఈ ఫలితాల ఆధారంఆ సీబీఐ ప్రతినిధులు సంబంధిత కంపెనీని పలు ప్రశ్నలతో సంధించారు. వారు దేనికీ సరైన సమాధానాలు ఇవ్వలేదు. దీంతో ఎన్డిపిఎస్ చట్టం అండర్ సెక్షన్ 29 రెడ్ విత్ 8,23, 38 ప్రకారం సంధ్య అక్వా ఎక్ప్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సహా, గుర్తు తెలియని మరికొందరిపైనా కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఎఫ్ఐర్లో పేర్కొంది.