ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు యాదాద్రిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు అవమానం జరిగిందంటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
Bhatti Vikramarka: యాదాద్రిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన సతీమణి ఇతర మంత్రులతో లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు (Bhatti Vikramarka) అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అందులో భాగంగా వారంత కూర్చున్నారు. సీఎంతోపాటు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, కొండా సురేఖ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ్యమత్రి దంపతులు, మంత్రులకు ఆలయ పండితులు ఆశీర్వనం అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
పూజలు నిర్వహించిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పీటలపై కూర్చున్నారు. ఉమముఖ్యమంత్రి భట్టికి ఆక్కడ స్థానం లేకపోవడంతో మరో పీట వేశారు. అలాగే కొండా సురేఖకు సైతం కాస్త ఎత్తుతక్కువగా ఉన్న పీట వేశారు. దీన్ని ప్రచారం చేస్తూ భట్టికి అవమానం అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం దంపతులు, మంత్రులకు ఆలయ పండితులు కంకణధారణ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.