Shanmukh Jaswanth : బిగ్ బాస్ ఫేమ్, పాపులర్ యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ గంజాయి కేసులో పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన వార్తల్లోని ముఖ్యాంశాల్లో నిలిచారు. ఓ కేసులో షణ్ముక్ సోదరుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు జస్వంత్ వద్ద గంజాయి దొరికింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న షణ్ముక్ కీలక విషయాలను బయటపెట్టాడు. ప్రస్తుతం నేను డిప్రెషన్లో ఉన్నాను. ఒక్కోసారి నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది. డిప్రెషన్ కారణంగానే డ్రగ్స్ తీసుకున్నానంటూ పోలీసుల సమక్షంలో షణ్ముక్ కన్నీళ్లు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఇటీవల హైదరాబాద్ నార్సింగి పోలీసులు షణ్ముక్ సోదరుడు సంపత్ వినయ్ కోసం షణ్ముక్ ఇంటికి వెళ్లగా అక్కడ గంజాయి, డ్రగ్స్ దొరికాయి. సంపత్ వినయ్ ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేయడమే కాకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని వైజాగ్‌కు చెందిన డాక్టర్ మౌనిక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. షణ్ముక్ ఫ్లాట్‌కు వెళ్లి చూడగా సోదరులు గంజాయితో పట్టుబడ్డారని తెలిసింది.