భార్య చికెన్(Chicken) వండలేదని భర్త ఆత్మహత్య(Suicide) చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ నగరంలో చోటుచేసుకుంది. ప్రేమ్ నగర్ ప్రాంతానికి చెందిన పవన్‌కు ప్రియాంక అనే మహిళతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. పవన్(Pavan) తరచూ తన ఇంటికి మద్యం సేవించి వచ్చేవాడు. ఈ విషయంలో భార్యభర్తలకు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.
తాజాగా గురువారం రాత్రి కూడా పవన్(Pavan) మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇంట్లో చికెన్(Chicken) కూర వండమని తన భార్య చెప్పగా అందుకు ఆమె చేయనని చెప్పింది. అప్పటికే వంట చేసేశానని, మళ్లీ చేయడానికి కుదరదని తేల్చి చెప్పేసింది. ఈ విషయంలో పవన్‌కు ప్రియాంకకు మధ్య వాగ్వాదం జరిగింది. కొంతసేపటికి గొడవ కాస్త సద్దుమణిగాక ప్రియాంక తన కూతురుతో కలిసి గదిలోకి వెళ్లి నిద్రపోయింది.
ప్రియాంక పడుకున్న తర్వాత పవన్(Pavan) వేరే గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. కొన్ని గంటల తర్వాత ఆ ఇంటికి మృతుడి సోదరుడు వచ్చి చూశాడు. అయితే అప్పటికే పవన్ ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు(Police Case) చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.