చింపాంజీ ఫోటోగ్రాఫర్‌ని నీరు తాపించమని అడుగుతుంది. ఆ వ్యక్తి కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చి తన చేతుల నుంచి నీరు త్రాగేలా చేస్తాడు. ఆ వ్యక్తి వెళ్లే ముందు, చింపాంజీ అతని చేతులను పట్టుకుని, వాటిని స్వయంగా నీటితో శుభ్రం చేయడం ప్రారంభించింది.
Viral Video: మనుషులకంటే జంతువులు చాలా విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. జంతువు ఒక వ్యక్తితో జతకట్టితే.. అది ప్రేమను కురిపించడమే కాకుండా.. దానికి చేసిన ఉపకారాన్ని కూడా మరచిపోదు. అవకాశం వచ్చినప్పుడు జంతువులు తమ రుణాన్ని తీర్చుకుంటాయి. సోషల్ మీడియాలో అలాంటి వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రజలు దానిని ఇష్టపడుతున్నారు. ఈ వీడియో చింపాంజీకి సంబంధించినది. ఒక వ్యక్తి చింపాంజీకి సహాయం చేశాడు. ఆ మాటలు రాని చింపాజీ కూడా అదే సమయంలో తన ఋణం తీర్చుకుంది.
చింపాంజీ ఫోటోగ్రాఫర్‌ని నీరు తాపించమని అడుగుతుంది. ఆ వ్యక్తి కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చి చింపాంజీని తన చేతుల నుంచి నీరు త్రాగేలా చేస్తాడు. ఆ వ్యక్తి వెళ్లే ముందు, చింపాంజీ అతని చేతులను పట్టుకుని, వాటిని స్వయంగా నీటితో శుభ్రం చేయడం ప్రారంభించింది. చింపాంజీ తన చేతులను కూడా ఎంత త్వరగా శుభ్రం చేసిందో చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఇదంతా చూసి ఆ వ్యక్తి భావోద్వేగానికి గురయ్యాడు.
వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ‘ఈ క్లిప్ గత వారం రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఆఫ్రికాలోని కామెరూన్లో చింపాంజీ, ఫోటోగ్రాఫర్‌ని నీరు త్రాగడానికి సహాయం కోరింది. ఆపై చేతులు కడిగి అతనికి కృతజ్ఞతలు చెప్పింది…విజయవంతం కావాలనుకుంటే.. సమాజం, ఆఫీసులోకి వ్యక్తులకు సహాయం చేయండి .. మద్దతు ఇవ్వండి.. తిరిగి, మీరు వారి మద్దతు పొందుతారు.’ అని క్యాప్షన్‌లో రాశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 1.8 మిలియన్లకు పైగా ప్రజలు చూశారు.. పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా దీన్ని షేర్ చేస్తున్నారు.
This clip went around the world last week. A Chimpanzee in Cameroon, Africa apparently asked for a photographers’s help in drinking water; then repaid him by washing his hands gently… A useful applied lesson: If you want to succeed, then assist & support those in your… pic.twitter.com/qLntPXfTkG