ఓ ఏనుగు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. గమనించిన సంబంధిత అధికారులు దానిని రక్షించి బయటకు తీశారు. ఈ సంఘటన శ్రీలంకలో చోటుచేసుకుంది. నవంబర్ 2వ తేదీన ఈ సంఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా… బావిలో పడిన ఏనుగును బయటకు తీయడానికి అధికారులు చాలా కష్టపడాల్సి వచ్చిందట. ఒకానొక సమయంలో.. వారు బావిలో ఎక్కువగా నీరు కూడా పోయాలని అనుకున్నారు. దాని వల్ల.. ఏనుగు నీటితోపాటు పైకి వస్తుంది కదా అని భావించారు. కానీ ఆ ప్రయత్నం చేయలేదు.
బావికి సమాంతరంగా బుల్డోజర్ తో ఓ లోతైన మార్గాన్ని తవ్వారు. దాని నుంచి ఏనుగును సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటన మొత్తం వీడియోలో స్పష్టంగా కనపడుతుంది. ఏనుగు వయసు 10 నుంచి 15 సంవత్సరాలు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.