ADB: సీపీఎం జన్నారం మండల మహాసభను విజయవంతం చేయాలని సీపీఎం జన్నారం మండల కార్యదర్శి కనికారపు అశోక్ కోరారు. గురువారం జన్నారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ సీపీఎం మండల మహాసభ అక్టోబర్ 1న జన్నారం మండల కేంద్రంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆశయ్య, జిల్లా కార్యదర్శి సంఖ్య రవి, ప్రముఖులు హాజరవుతారన్నారు.