WGL: వరంగల్ ఎయిర్ పోర్టును విస్తరించడానికి జిఎంఆర్ సంస్థ అంగీకారం తెలిపింది. అదనపు భూసేకరణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విమానయాన శాఖకు ఉత్తరం రాసినట్లుగా సమాచారం. దీంతో సంబంధిత అధికారులు రంగంలోకి దిగి సర్వే పనులను ముమ్మరం చేశారు. 2025లోగా వరంగల్ నుంచి విమానాలు ఎగిరేల చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించారు.