SDPT: రైతు సమస్యలపై పోరాటానికి నంగునూరు వేదికగా మారనుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం తెలిపారు. రైతుబంధు, పంటలకు బోనస్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 27న నంగునూరులో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏర్పాట్లలో భాగంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.