ADB: రేషన్ కార్డులు మంజూరులో జాప్యం చేయడం సరికాదని బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి మనాల శేఖర్ శేఖర్ అన్నారు. ఈ విషయమై బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల కుదింపు కోసమే కుటుంబ సర్వే చేపడుతుందన్నారు. అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా ఏ ఒక్కరికి రేషన్ కార్డులు అందించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.