JN: రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన నడుస్తుందని బీఆర్ఎస్ పార్టీ లింగాల గణపురం మండల అధ్యక్షుడు బసవగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వానాకాలం రైతు భరోసా డబ్బులు రానట్లే అని అన్న మాటలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని బీఆర్ఎస్ పార్టీ సహించదన్నారు.