SRPT: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల వేళ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికి ప్రతి నెలా 2500 రూపాయలు ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని మహిళా సమాఖ్య సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరం మల్లీశ్వరి అన్నారు. గానుగబండ గ్రామంలో బుధవారం నిర్వహించిన మహిళా సమాఖ్య మహాసభలో మాట్లాడారు. మహిళలపై అరాచకాలు రోజు జరుగుతున్నాయన్నారు.