ADB: ఆదిలాబాద్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీకి చెందిన వేదులూరు ప్రవీణ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ గురువారం వారి నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.