SRD: సదాశివపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంఎన్ఆర్ ఆసుపత్రి సహకారంతో డెంటల్ ఉచిత వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. కళాశాలలోని అధ్యాపకులు విద్యార్థులకు డెంటల్ వైద్య పరీక్షలను చేశారు. దంతాలు శుభ్రంగా ఉంచుకునేందుకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రత్న ప్రసాద్, ఎన్ఎస్ఎస్ అధికారులు మురళీకృష్ణ, శకుంతల పాల్గొన్నారు.