వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు నిర్వహించబోయే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ హాజరవుతారని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం లో భాగంగా నిర్వహించే పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.