కామారెడ్డి: జిల్లాలో నూతనంగా ఏర్పడిన జిల్లా మత్స్యకారుల సహకార సంఘం సర్వసభ్య సమావేశం ఈనెల 6న నిర్వహించనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సర్వసభ్య సమావేశం మున్నూరుకాపు సంఘం వీక్లీ మార్కెట్ వద్ద ఉదయం 9 గం. ఉంటుందని ఈ సమావేశానికి కేవలం సంబంధిత మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పదవిలో ఉన్న అధ్యక్షులు మాత్రమే హాజరు కావాలని అన్నారు.