ADB: సిర్పూర్లోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ఎదుట సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు నిరాహార దీక్ష ప్రారంభించారు. అమాయక రైతులను హింసించిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులపై చర్యలు తీసుకునే వరకు దీక్ష కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.