మెదక్: విద్యుత్ షాక్కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హవేలీ ఘనాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులను ఆర్డీవో రమాదేవి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హవేలీ ఘనాపూర్ మండలం తహశీల్దార్ సింధూరేణుక, డిప్యూటీ తహశీల్దార్ నవీన్ కుమార్, తదితరులు ఉన్నారు.