BDK: ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాష సంయుక్తంగా ఒక ప్రకటనలో కోరారు. ఆదివారం కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో కంచర్ల జమలయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందని ఈ సందర్భంగా తెలిపారు.