»We Will Replace 2 Lakh Jobs In A Year Cm Revanth Reddy
CM Revanth Reddy: ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం
కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదని ఈ ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఎల్బీస్టేడియంలో స్టాఫ్ నర్స్ నియామక పత్రాలను అందించారు.
We will replace 2 lakh jobs in a year.. CM Revanth Reddy
CM Revanth Reddy: విద్యార్థుల త్యాగలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కానీ వారు అనుకున్న లక్ష్యాలకు చేరుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. ఎల్బీస్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలను అందించారు. ఎన్నో రోజులు నుంచి వీరి నియామకం ప్రక్రియ పెండింగ్లో ఉందని ఈ రోజు 7,094 మందికి స్టాఫ్ నర్సులుగా నియామకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని, ఈ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రక్రియ మొదలు కానుందని వెల్లడించారు. రాబోయే నోటిఫికేషన్లో 15వేల పోలీసు ఉద్యోగాలు వేస్తామన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల కళను నీరుగార్చారు అని, ఎంపీగా ఓడిపోయిన తన బిడ్డ కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీగా సీటు ఇచ్చారు అని గుర్తుచేశారు. వైద్యారోగ్య శాఖలో ఉన్న మిగితా ఖాళీలను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని, ఈ నియామక ప్రక్రియలో భాగస్వామ్మం అయినందుకు సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.