NGKL: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం బిజినేపల్లి కస్తూర్బా విద్యాలయంలో రేబిస్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. వైద్యాధికారి వెంకట దాస్ మాట్లాడుతూ.. కుక్క కాటుతో లాలాజలం చర్మం ద్వారా రక్తంలోకి ప్రవేశించి వ్యాధి సోకుతుందన్నారు. కుక్కకాటును నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న రేబిస్ టీకాను తీసుకోవాలన్నారు.