SRPT: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలని, రజక సంఘం సొసైటీ భవనం నిర్మించాలని కోరారు.