సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్కు తరలిస్తున్నారు.
Tammeneni Veerabhadram has a heart attack.. Moved to Hyderabad
Tammeneni Veerabhadram: సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స తీసుకున్నఅనంతరం డాక్టర్ల సలహామేరకు వీరభద్రంను హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. తమ్మినేని వీరభద్రం ఖమ్మం నుంచి ఏంపీగా 1996 నుంచి 1998 వరకు పని చేశారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో 2004లో ఖమ్మం నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సీపీఎం పార్టీలోనే కొనసాగుతూ ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. ప్రస్తుతం సీపీఎం పార్టీ రాష్ట్ర కార్మదర్శిగా ఆయన సేవలు అందిస్తున్నారు.