• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో మాజీ ఎమ్మెల్యే

BHPL: టేకుమాట్ల మండలం పంగిడి పల్లి గ్రామంలో గ్రామ ముదిరాజ్‌లు నిర్వహిస్తున్న పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

December 28, 2024 / 01:21 PM IST

అనుమతిని కోరుతూ DMHOకు ఆశాలు వినతి

NRML: ఈనెల 31న ఆశా కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టారు. అందులో భాగంగా శనివారం నిర్మల్ జిల్లా ఆశా కార్యకర్తలు చలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతిని కోరుతూ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాజేందర్‌కు వినతి పత్రం సమర్పించారు. అధ్యక్షురాలు సబిత మాట్లాడుతూ.. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

December 28, 2024 / 01:15 PM IST

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: ఎమ్మెల్యే పాయం

BDK: అశ్వాపురం మండలం నెల్లిపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

December 28, 2024 / 01:14 PM IST

మల్దకల్ తిమ్మప్పను దర్శించుకున్న బండ్ల జ్యోతి

GDWL: మల్దకల్ మండల కేంద్రంలో వెలసిన తిమ్మప్ప స్వామిని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందించారు.

December 28, 2024 / 01:08 PM IST

ప్రభుత్వ సలహాదారుడిని కలిసిన మక్తల్ ఎమ్మెల్యే

NRPT: హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని శనివారం ఆయన నివాసంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై చర్చించినట్లు చెప్పారు. ఆయన వెంట మాజీ మార్కెట్ వైస్ ఛైర్మన్ అనిల్ గాయత్రి, నాయకులు ఉన్నారు.

December 28, 2024 / 01:06 PM IST

నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్

HYD: ఆటోలో ప్యాసింజర్ మరిచిపోయిన సెల్ ఫోన్ పోలీసులకు అప్పగించి ఓ ఆటోడ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. శ్రీనివాస్ అనే ఆటోడ్రైవర్ తన ఆటోలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడిని చర్లపల్లి రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న బస్ స్టాప్ వద్ద డ్రాప్ చేశాడు. అయితే కొద్దిసేపటికి ఆటోలో సెల్ ఫోన్ గుర్తించి, ప్రయాణికుడి కోసం వెతకగా కనిపించలేదు. దీంతో మొబైల్‌ను పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు.

December 28, 2024 / 12:57 PM IST

ఆ రూట్లో అదనపు బస్సులు ఏర్పాటు

HYD: చర్లపల్లి నుంచి బోరబండకు అదనపు బస్సులను ప్రారంభించినట్లు చెంగిచెర్ల డిపో మేనేజర్ కే. కవిత తెలిపారు. చర్లపల్లి నుంచి ఉప్పల్, రామంతాపూర్ మీదుగా బోరబండకు ఉదయం 8.35 గంటల నుంచి సాయంత్రం 7.35 గంటల వరకు ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు సౌకర్యాన్ని కల్పించామని వెల్లడించారు.

December 28, 2024 / 12:56 PM IST

జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం

వరంగల్: రాయపర్తి మండల కేంద్రంలో ప్రగతి స్కూల్ ఆవరణలో రాయపర్తి క్రికెట్ లీగ్ టోర్నమెంట్‌ను శనివారం కొబ్బరికాయ కొట్టి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

December 28, 2024 / 12:51 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

NRML: బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా శనివారం లోకేశ్వరం మండలంలోని కిస్టాపూర్ గ్రామంలో బూత్ కమిటీలను ఎమ్మెల్యే రామారావు పటేల్ పర్యవేక్షించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి కార్యకర్తలు నిరంతరాయంగా కృషి చేయాలని సూచించారు.

December 28, 2024 / 12:39 PM IST

అరుణ్ జైట్లీ సేవలు మరువలేనివి: బండి సంజయ్

KNR: దివంగత కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సేవలు మరువలేనివని కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు అరుణ్ జైట్లీ జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. అరుణ్ జైట్లీ మహోన్నతమైన రాజనీతిజ్ఞుడు, విశేషమైన వక్త అని కొనియాడారు. ఆయన భారతదేశ పాలసీ ఫ్రేమ్ వర్క్స్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు.

December 28, 2024 / 12:38 PM IST

గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా

SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు శనివారం ధర్నా చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా వెట్టి చాకిరీ చేస్తున్నామని, తమకు వేతనాలు పెంచడం లేదని వారు వాపోయారు. గ్రామపంచాయతీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలని, వేతనాలు రెట్టింపు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

December 28, 2024 / 12:36 PM IST

వృద్ధురాలిపై వైద్య సిబ్బంది అమానుషం

JGL: గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనారోగ్యానికి గురై వారం రోజుల కింద జగిత్యాల ఆస్పత్రిలో చేరాడు. అయితే అతనికి సాయంగా భార్య మల్లవ్వ ఉంటోంది. ఈ క్రమంలో ఆమె హై బీపీతో బాధపడుతూ సొమ్మసిల్లి కింద పడిపోయింది. వైద్యం అందిచాల్సిన ఆస్పత్రి సిబ్బంది ఆమెను బయట రోడ్డుపై పడేశారు.

December 28, 2024 / 12:35 PM IST

ప్రజా పాలన నిర్వహించిన ఎమ్మెల్యే జారే

BDK: దమ్మపేట మండలం గండుగులపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు పాల్గొని, తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

December 28, 2024 / 12:32 PM IST

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత: ఎంపీ నగేశ్

ADB: బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలోని శబరిమాత ఆశ్రమంలో అయ్యప్ప స్వాముల పడి పూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు నగేశ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎంపీ నగేశ్ పేర్కొన్నారు. బీజేపీ నాయకులు రాజు, తులసి రామ్, శ్రీనివాస్ తదితరులున్నారు.

December 28, 2024 / 12:29 PM IST

‘క్రీడా స్ఫూర్తిని కలిగిన వారే క్రీడాకారులు’

GDWL: క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని బీఆర్ఎస్ జిల్లా నాయకులు బాసుల హనుమంతు నాయుడు అన్నారు. శనివారం గట్టు మండలం ఇందువాసి గ్రామంలో క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు ఆటల్లో సమయస్ఫూర్తిని కలిగి ఉండాలని అన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారులు సమయస్ఫూర్తి, క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని క్రీడాకారులకు సూచించారు.

December 28, 2024 / 12:28 PM IST