NRML: పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శనివారం లోకేశ్వరం మండలం కిష్టాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న బీజేపీ బూత్ కమిటీ ఎన్నికల పనితీరును వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన బీజేపీ పటిష్టానికి కార్యకర్తలు కృషి చేయాలని, స్థానిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
ఖమ్మం: తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు మీదుగా ధాన్యం, ఇతరత్రా ఏవి కూడా అక్రమంగా రవాణా చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీపీ సునీల్ దత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎర్రుపాలెంలోని పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో పలు రికార్డులు పరిశీలించారు. సరిహద్దు చెక్ పోస్టులవద్ద నిరంతరం తనిఖీలు చేపడుతూ అక్రమార్కులను కట్టడి చేయాలని సూచించారు.
MBNR: ఆంధ్రప్రదేశ్ గ్రామీ వికాస్ బ్యాంక్(APGVB) తెలంగాణ గ్రామీణ బ్యాంకు(TGB)లో విలీనం కానుంది. 2025 JAN1 నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి 31 వరకు బ్యాంకింగ్ సేవల (UPI, ATM, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, AEPS, CSP) తాత్కాలికంగా అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని పాలమూరు జిల్లా బ్యాంకు అధికారులు కోరారు.
SRPT: సూర్యాపేట జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ శనివారం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని, పేస్కేల్ వెంటనే ఇవ్వాలని, టీ తాగే లోపు జీవో ఇస్తామన్న రేవంత్ రెడ్డి మీ హనుమకొండ హామీ ఏమయిందని ప్రశ్నించారు.
BDK: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును శనివారం అశ్వాపురం మండల వర్కింగ్ జర్నలిస్ట్‌లకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలనీ వినతి పత్రం అందించారు. ప్రెస్ క్లబ్ వారిని తాము గమనిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్న వారిని ఎమ్మెల్యే అభినందించారు. త్వరలోనే జర్నలిస్ట్‌లకు ఇంటి స్థలాలు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే పాయం హామీ ఇచ్చారు.
MNCL: చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలోని ఆది శంకరాచార్య పత్తి మిల్లు వద్ద శనివారం పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. మిల్లులో పత్తి కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని కొనుగోలు చేయకపోవడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు. వెంటనే పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
NGKL: ధనుర్మాసం మహోత్సవం సందర్భంగా శనివారం తెల్కపల్లి మండలం పెద్దూరుకు శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వచ్చారు. స్వామివారికి గ్రామ కాంగ్రెస్ నాయకుడు బుచ్చిరెడ్డి దంపతులు స్వాగతం పలికారు. మూడు రోజుల పాటు మండలంలోని పలు గ్రామాల్లో రామాలయాల నిర్మాణానికి స్వామి భూమిపూజ చేయనున్నారు.
MNCL: నగరంలో ఇవాళ జరగనున్న రెండు న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభకు ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి ముఖ్య నాయకులు బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత విప్లవోద్యమానికి, సమసమాజ స్థాపనకు ఒకే కమ్యూనిష్టు, బలమైన పార్టీ నిర్మాణం అవసరం దృష్ట్యా రెండు పార్టీలు విలీనం అవుతున్నట్లు తెలిపారు.
ADB: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించారని కోరుతూ MLA పాయల్ శంకర్‌ను మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, యూనియన్ సభ్యులు తదితరులున్నారు.
నిజామాబాద్: ఎల్లారెడ్డి మండలం అడవి లింగాల గ్రామానికి చెందిన గంగవ్వ అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా శనివారం గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఆయనతో పాటు గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
MBNR: సీసీటీవీ కెమెరా ఇన్సలేషన్ సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ, భోజనం, వసతి కల్పిస్తున్నట్లు ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. నేటి నుంచి 13 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన గ్రామీణ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
JGL: మల్యాల మండలంలోని కేజీబీవీ పాఠశాల బాలికలు ఇవాళ నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలకు చెందిన టీచర్స్ సమ్మెకు వెళ్లడంతో అధికారులు తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను కేటాయించారు. అయితే తమ టీచర్స్ తమకే కావాలని బాలికలు పాఠశాల ఆవరణలో బైటాయించి నిరసన తెలిపారు. డీఈవో ఫోన్ చేసి మాట్లాడడంతో బాలికలు నిరసన విరమించి క్లాసులోకి వెళ్లారు.
KMM: న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి శనివారం తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాళి అర్పించారు. భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన మహోన్నత వ్యక్తిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్ సేవలను మంత్రి పొంగులేటి గుర్తు చేసుకున్నారు.
మేడ్చల్: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి రాంపల్లి డబుల్ బెడ్ రూమ్స్ వద్ద గంజాయి విక్రయిస్తూ మణికంఠ (21) అనే హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థి పట్టుబడ్డాడు. 1. 5 కేజీల గంజాయి స్వాదీనం, పోలీసుల అదుపులో మణికంఠ ఉన్నారు. మల్లాపూర్‌లో ఉండే మణికంఠ, హోటల్ మేనేజ్ మెంట్ రెండోవ సంవత్సరం చదువుతున్నాడు.
MNCL: శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణక్క నగర్‌లో శనివారం పోలీస్ కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో వాహన పత్రాలు, నంబర్ ప్లేట్లు సరిగా లేని, సైరన్ వాడే 25 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 5 కార్లు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వేణుచందర్, ఎస్సైలు పాల్గొన్నారు.