• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ధరణి రద్దు.. 1 నుంచి భూ భారతి ప్రారంభం

KMM: డిసెంబర్ 31తో ధరణి పోర్టల్ సేవలు ముగియనున్నాయి. ఈ స్థానంలో జనవరి 1 నుంచి భూ భారతి సేవలు అందుబాటులోకి రానున్నట్లు కల్లూరు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ధరణి వివరాలు టెర్రాసిస్ ఏజెన్సీ నిర్వహించేది. జనవరి ఒకటి నుంచి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ద్వారా భూ భారతి పోర్టల్ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రానుంది.

December 29, 2024 / 03:14 PM IST

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సీఐ

KMM: న్యూ ఇయర్ పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మధిర సీఐ మధు ఆదివారం అన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజల భద్రతలను దృష్టిలో ఉంచుకొని కఠిన నిబంధనలు అమలులో ఉంటాయని చెప్పారు. మైనర్లకు వాహనాలను ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారి పట్ల కఠిన చర్యలు తప్పవు అన్నారు.

December 29, 2024 / 03:01 PM IST

యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు మహాసభ

HNK: జిల్లా కేంద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో ఆదివారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ పాల్గొని జర్నలిస్టులు ఎదుర్కుంటున్న సమస్యలు, పరిష్కారాల మార్గాలపై చర్చించారు.

December 29, 2024 / 03:01 PM IST

మహిళల్లో చైతన్యం కోసమే ఫెలోషిప్ క్లబ్బులు

ADB: మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇందిరా ఫెలోషిప్ కార్యక్రమాన్ని చేపట్టామని ఇందిరా ఫెలోషిప్ ఉమ్మడి జిల్లా యూనిట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణ తెలిపారు. ఆదివారం ఉట్నూర్ మండలం తేజాపూర్, బోయవాడ, ఎన్టీఆర్ గల్లి, వడ్డెర వాడల్లో “శక్తి అభియాన్” క్లబ్‌లను ఏర్పాటు చేశారు. శక్తి అభియాన్‌లో భాగంగా ఉమెన్ ఎంపవరింగ్ లక్ష్యంతో క్లబ్బులు పనిచేస్తాయన్నారు.

December 29, 2024 / 03:00 PM IST

విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి

MLG: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంగపేట మండలం కోమటిపల్లిలో ఆదివారం వరి చేనులో విద్యుత్ షాక్‌తో జవ్వాజి రామకృష్ణ (30) మృతి చెందారు. పంట పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామకృష్ణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

December 29, 2024 / 03:00 PM IST

క్రిమిసంహారక మందు సేవించి యువకుడి ఆత్మహత్య

నల్గొండ: చండూరు మండలం ధోనిపాముల గ్రామానికి చెందిన పొట్టిపాక పెద్దలు గారి ఏకైక కుమారుడు శ్రీ పొట్టిపాక నర్సింహా(38)గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. తన తండ్రి పెద్దలు గారు ఇదివరకే మరణించడం జరిగింది. ఇతనికి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. ఏకైక కుమారుడు మరణించడంతో అతని కుటుంబంలో కన్నీటి రోదనలు వినిపిస్తున్నాయి.

December 29, 2024 / 02:59 PM IST

మొదటి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఎమ్మెల్యే

MDK: రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి హాస్టల్ మొదటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వెంకట్ రెడ్డితో పాటు ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి హాస్టల్‌తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు.

December 29, 2024 / 02:56 PM IST

మహిళల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం

NZB: మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యా యని AICOW రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అంగడి పుష్ప, వంగాల రాధా అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయ్యాయన్నారు.

December 29, 2024 / 02:55 PM IST

సర్వీస్ రోడ్డును నిర్మించాలి

NRML: సోన్ మండలం కడ్తాల్ గ్రామానికి సర్వీస్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆదివారం 20వ రోజుకు చేరింది. గ్రామస్తులు మాట్లాడుతూ నిర్మల్, హైదరాబాద్ నుండి వచ్చే భారీ వాహనాలు సర్వీస్ రోడ్డు నుంచి రావడంతో గ్రామంలో ప్రమాదాలు జరుగుతున్నాయని, గ్రామానికి సంబంధించిన సర్వీస్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.

December 29, 2024 / 02:55 PM IST

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన మేయర్

KNR: కరీంనగర్ నగరంలోని 20వ డివిజన్ ఆరెపల్లి ఆర్టీసీ కాలనీ ప్రాంతాలలో ఆదివారం సుమారు 63 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణానికి స్థానిక డివిజన్ కార్పొరేటర్ తుల రాజేశ్వరి-బాలయ్యతో కలసి నగర మేయర్ సునీల్ రావు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు.

December 29, 2024 / 02:53 PM IST

‘న్యాయం చేసే వరకు సమ్మె విరమించం’

సిద్దిపేట: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సమగ్ర శిక్షా ఉద్యోగాలు చేపట్టిన సమ్మె నేటితో 20వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె విరమించేది లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు. తమను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

December 29, 2024 / 02:52 PM IST

భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతి ఒక్కరికి దిక్సూచి: ఎమ్మెల్యే

BDK: వందేళ్ళ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతి ఒక్కరికి దిక్సూచి అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పుట్టగొడుగులా పుట్టుకొచ్చే పార్టీలు ఎన్నో వస్తున్నాయని, అవి అధికారం లేకుంటే కనుమరుగవుతున్నాయని చెప్పారు.

December 29, 2024 / 02:50 PM IST

జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం

BDK: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఏరియా జనరల్ మేనేజర్ కృష్ణయ్యకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. పర్మినెంట్ కార్మికులకు ఇచ్చే సౌకర్యాలను సైతం కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని సీఐటీయూ నాయకులు అబ్దుల్ నబీ తెలిపారు. కార్మికులకు ప్రతి నెల మొదటి వారంలో జీతాలను చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

December 29, 2024 / 02:47 PM IST

దారి దోపిడీకి పాల్పడ్డ నిందితులు అరెస్ట్

HYD: కులుసుంపుర పరిధిలో దారి దోపిడీకి పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణ అనే వ్యక్తి పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న వేళ కులుసుంపుర పరిధిలో ముగ్గురు వ్యక్తులు అతన్ని చుట్టుముట్టి, అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ మరియు వాహన తాళాలు తీసుకొని పరారయ్యారు.

December 29, 2024 / 02:46 PM IST

భద్రాద్రి రామయ్యకు సువర్ణ పుష్పార్చన పూజ

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి అర్చకులు సువర్ణ పుష్పార్చన ఆదివారం నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామి వారికి సుప్రభాత సేవ చేశారు. ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని జరిపారు.

December 29, 2024 / 02:44 PM IST