ADB: సమ్మె చేస్తున్న సీఆర్టీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆదిలాబాద్ ఎంపీ జీ.నగేష్ డిమాండ్ చేశారు. ఉట్నూరు పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో సమ్మె చేస్తున్న సీఆర్టిలను ఆదివారం సాయంత్రం ఆయన కలిసి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రితేష్ రాథోడ్, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుమన్ బాయి పాల్గొన్నారు.
SRD: కంది మండలం చేర్యాల మాజీ సర్పంచ్ శ్రవణ్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. TGIIC ఛైర్ పర్సన్ నిర్మలరెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆంజనేయులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్ పాల్గొన్నారు.
WNP: వనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో రానున్నారని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వనపర్తి ఎమ్మెల్యే భేటీ అయ్యారు. విద్య, వైద్యం, వ్యవసాయం సాగునీరు లాంటి తదితర అంశాలపై కీలకంగా చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. RRR నార్త్ టెండర్ ప్రక్రియ ప్రారంభంపై కోమటిరెడ్డికి సీఎం అభినందనలు తెలిపారు. 2017లో ఆగిపోయిన ప్రాజెక్టును ఏడాదిలోపే ప్రారంభించడంలో తన సహకారం, కృషితోనే సాధ్యమైందని ఫోన్‌లో మంత్రి కోమటిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కొనియాడారు.
KNR: జమ్మికుంట-ఓడేడు బస్సును పునరుద్ధరించాలని జమ్మికుంట, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రజలు కోరుతున్నారు. ఓడేడు నుంచి జమ్మికుంటకు వెళ్లే ఈ బస్సు వల్ల 3 మండలాల ప్రజలకు ఉపయోగకరంగా ఉండేది. కరోనా సమయంలో మంథని ఆర్టీసీ డిపో అధికారులు బస్సును నిలిపివేశారు. దీంతో ప్రయానికులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత ఆర్టీసీ డిపో అధికారులు స్పందించి బస్సును పునరుద్ధరించాలని కోరుతున్నారు.
కామారెడ్డి: బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి ఈఎన్ టీ ఆస్పత్రి సహకారంతో లయన్స్ భవన్ లో చెవి, ముక్కు, గొంతు స్క్రీనింగ్ క్యాంపు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మేకల గాలయ్య, సానేపు గంగారాం, గంగారాం, యామ రాములు, సందీప్, విఠల్, సంతోష్, రషీద్, దత్తు, రమేశ్, రవీందర్ పాల్గొన్నారు.
NRPT: ఎస్సీ వర్గీకరణపై ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించేందుకు ఎస్సీ వర్గీకరణ విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ షమిమ్ అక్తర్ ఈ నెల 31న మహబూబ్‌నగర్‌కు రానున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం తెలిపారు. జిల్లాలోని ఎస్సీ కుల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేయనున్న సమావేశంలో కమిషన్ సభ్యులకు వినతులు అందించవచ్చని సూచించారు.
BNHG: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో కొలువుదీరిన మల్లికార్జున స్వామి కళ్యాణం మహోత్సవానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం హాజరయ్యారు. ఈ మేరకు మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకొని వీరశైవాగమశాస్త్రం ప్రకారం నిర్వహించే కళ్యాణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
SRD: అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన మాణిక్ యాదవ్ జిన్నారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ తల్లి గుడి నిర్మాణానికి 150 సిమెంట్ బస్తాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బి ఆర్ ఎస్ నాయకులు వెంకటేశం గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి, మాజీ వార్డు సభ్యులు లింగం, మల్లేష్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.
MDK: తూప్రాన్ పట్టణ మున్సిపల్ పరిధిలో తూప్రాన్ మున్సిపల్ ఛైర్ పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేశ్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని విగ్రహాల శుద్ధి కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను ప్రతి ఆదివారం శుద్ధి చేసే కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు.
మేడ్చల్: నాగోల్ తట్టి అన్నారంలో గల గోవర్ధనం గోశాలలో గోపూజా కార్యక్రమం. 30 డిసెంబర్ 2024 సోమవారం రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు అమావాస్య సందర్భంగా గోత్ర నామాలతో అమావాస్య గోపూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు గోవర్ధనం గోశాల వ్యవస్థాపకుడు డాక్టర్ లక్ష్మణ్ శర్మ ఒక ప్రకటనలో తెలియజేశారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అన్న ప్రసాద వితరణ చేయనున్నట్లు, డాక్టర్ లక్ష్మణ్ శర్మ తెలిపారు.
కామారెడ్డి: కొత్త ఏడాది వేళ యువత అదుపులో ఉండాలని, డ్రగ్స్ జోలికి వెళ్లవద్దని ఎక్సైజ్ సీఐ విజయ్ కుమార్ సూచించారు. అనుమతి లేని ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫంక్షన్ హాళ్లలో అయితే ఖచ్చితంగా అనుమతి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల మద్యం తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటుంది.
BHNG: భువనగిరి మున్సిపాలిటీ రాయగిరి రిలయన్స్ పెట్రోలు పంపు ఎదుట రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ వైపు వెళ్తున్న కార్లు మూడు ఒకదానికొకటి ఢీ కొట్టాయి. కార్లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
RR: న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఇబ్రహీంపట్నం, మంచాల ప్రజలకు SHO మధు విజ్ఞప్తి చేశారు. చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని కోరారు. యువత మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. తమ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
KMM: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్వగ్రామం ఇనుగుర్తికి చెందిన రిటైర్డ్ టీచర్ చించా పట్టణ గోమఠం శ్రీనివాసాచార్యులు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎంపీ రవిచంద్ర తన పెద్దన్న వద్దిరాజు కిషన్‌తో కలిసి శ్రీనివాసాచార్యులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. హన్మకొండ కేఏల్టైన్ కాలనీకి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు.