MBNR: మత్స్యకారుల అభివృద్ధికి చెరువులు కుంటలకు మరమ్మతు చేపట్టాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టుకాడి ప్రభాకర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆక్రమణలకు గురైన చెరువులు కుంటల్లో ప్లాట్లు వెలిశాయని వాటిని అక్రమార్కుల నుండి కాపాడాలని కోరారు.