RR: నందిగామ మండల పరిధిలోని వెంకమ్మగూడ గ్రామంలో సర్పంచ్ అశోక్ సహకారంతో విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను పరిశీలించారు. గ్రామంలోని వీధులు,కాలనీలో తిరుగుతూ ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, స్తంభాల పరిస్థితిని పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్యామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు.