W.G: లంచం తీసుకుంటూ తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు ఏసీబీ అధికారులకు చిక్కారు. ఒక మోటార్ సైకిల్ చోరీ వ్యవహారంలో రూ. 25,000 లంచం డిమాండ్ చేయగా రూ. 5,000 సోమవారం రాత్రి బాధితుడు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.