KMM: చింతకాని మండలం ప్రొద్దుటూరులో మంగళవారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామ సర్పంచ్ కృష్ణయ్య ఆధ్వర్యంలో స్థానిక వైకుంఠధామం ఆవరణను గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది శుభ్రం చేశారు. చెత్తాచెదారం, ముళ్ల పొదలు, చెట్ల కొమ్మలను తొలగించి పరిసరాలను చదును చేశారు. వాటర్ ట్యాంకును శుభ్రపరిచి, బోరు బావి వద్ద నిలిచిన మురుగునీటిని తొలగించారు.