WNP: పానగల్ మండలం కొత్తపేటలో శ్రీ సాయి నేత్రాలయ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. సర్పంచ్ రాధా కిరణ్, ఉప సర్పంచ్ బాలరాజు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. మధుమేహం వల్ల కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉందని, ముందస్తు పరీక్షలు అవసరమని సర్పంచ్ పేర్కొన్నారు. మొత్తం 90 మందికి పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.